కావలసిన పదార్థాలు:
కీరదోస: ఒకటి
జీడిపప్పులు: పది
పచ్చిమిరపకాయలు: రెండు లేదా
మిరియాల పొడి: పావు స్పూను
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
జీడిపప్పుల్ని ఒక గిన్నెలో వేసి వేడినీళ్లు పోసి పది నిముషాలు నానబెట్టాలి. ఇంతలో కీరదోసకాయని శుభ్రంగా కడిగి సన్నని ముక్కలుగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా ముక్కలు చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మిక్సీలో వేసి మెత్తగా పట్టాలి. తినే ముందు ఈ మిశ్రమాన్ని కీరదోస ముక్కల్లో వేసి బాగా కలపాలి.
చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే కాజూ డ్రెస్డ్ కుకుంబర్ సలాడ్ సిద్ధమైనట్టే. ఇక్కడ పచ్చిమిర్చి బదులు మిరియాల పొడిని కూడా వాడుకోవచ్చు. ఆ రుచి కూడా బాగానే ఉంటుంది. ఏది వాడినా ముక్కలకు మిశ్రమాన్ని తినేముందు మాత్రమే కలపాలి. లేకపోతే నీరు నీరుగా అవుతుంది. ఇది గుర్తుంచుకుంటే చాలు!