కావలసిన పదార్థాలు
మిల్క్ బ్రెడ్: నాలుగు స్లైసులు, నెయ్యి: పావు కప్పు, యాలకుల పొడి: చిటికెడు, చక్కెర: అరకప్పు, కాజు, కిస్మిస్: ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున, పాలు: పావు కప్పు.
తయారీ విధానం
బ్రెడ్ స్లైసుల్ని అంచులు కత్తిరించి నాలుగు ముక్కలు చేసుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి, నెయ్యివేసి, బాగా వేడయ్యాక బ్రెడ్ ముక్కల్ని దోరగా వేయించి తీయాలి. అదే పాన్‌లో కాజు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టాలి. పాన్‌లో మిగిలిన నెయ్యిలోనే ఒక కప్పు నీళ్లు, చక్కెర వేసి బాగా మరిగించి.. వేయించిన బ్రెడ్ ముక్కల్ని అందులో రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా పాలు, యాలకులపొడి, వేయించిన కాజు, కిస్మిస్ జోడించి ఇంకో రెండు నిమిషాలు ఉడికించి దించితే సరి. నోరూరించే బ్రెడ్ హల్వా సిద్ధం.