ఓట్స్: రెండు కప్పులు, కందిపప్పు: ఒక కప్పు
ఉల్లిగడ్డలు: రెండు , క్యారెట్లు: రెండు
ఆలుగడ్డలు: రెండు , బీన్స్: గుప్పెడు
నూనె: టేబుల్ స్పూన్, జీలకర్ర: అర స్పూను
ఆవాలు: స్పూను , దాల్చిన చెక్క: చిన్న ముక్క
సాంబార్ పొడి: ఒక స్పూను
చింతపండు: నిమ్మకాయ సైజులో
కరివేపాకు: రెండు రెబ్బలు
ఉప్పు: తగినంత
ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆలుగడ్డలు, క్యారెట్, బీన్స్లను శుభ్రంగా కడిగి అంగుళం ముక్కలుగా కట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఓట్స్, కందిపప్పులను విడివిడిగా ఉడికించుకోవాలి. చింతపండు కడిగి రసం తీసి పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసి జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేయాలి. కాస్త వేగాక ఇందాక ఉడికించుకున్న ముక్కలను కలపాలి.
ఇందులోనే ఉడికించిన పప్పు, ఓట్స్లను కూడా వేయాలి. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం, తగినంత ఉప్పు, సాంబార్ పొడి, కరివేపాకులను కూడా జోడించాలి. అన్నింటినీ బాగా కలిపి బాణలి మీద మూత పెట్టి ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా ఉడికించుకుంటే బిసిబేళ పులి బాత్ రెడీ!