కావలసిన పదార్థాలు
అరటి పండ్లు: రెండు, పాలు: ఒక కప్పు, వాల్నట్స్, బాదం, జీడిపప్పు: పది చొప్పున, పీనట్ బటర్: ఒక టీస్పూన్, తేనె: రెండు టీస్పూన్లు.
తయారీ విధానం
వాల్నట్స్, బాదం, జీడిపప్పు గంటపాటు నానబెట్టాలి. మిక్సీ జార్లో అరటి పండ్లు, పాలు, నానబెట్టిన డ్రైఫ్రూట్స్, పీనట్ బటర్, తేనె వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తయారైన స్మూతీని గ్లాసులో పోసి పైనుంచి అరటి ముక్కలు, తరిగిన బాదం వేసుకుంటే తక్షణ శక్తినిచ్చే బనానా ప్రొటీన్ స్మూతీ సిద్ధం.