యువరాజ్ గౌడ, నిఖిల్, దీపక్‌శెట్టి, ఖ్యాతి, నిఖిత స్వామి ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘శిఖండి’. గురుమూర్తి.వి దర్శకుడు. పోలా ప్రవీణ్‌కుమార్ నిర్మాత. వేసవిలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘మహాభారతంలో శిఖండి పాత్ర చాలా కీలకం. ఆమె దైవస్వరూపిణి. ఆ పాత్రకు నేటి యుగానికి ముడిపెడుతూ చేసిన ప్రయోగం ‘శిఖండి’. అభిరుచితో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు’ అన్నారు.
‘శిఖండి’ లాంటి మంచి సినిమాను నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని, ప్రేమ, హాస్యం, యాక్షన్, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలూ ఈ కథలో ఉన్నాయని, యూనిట్ అంతా ఓ కుటుంబంలా కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించారని నిర్మాతలు తెలిపారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.