Kannappa | మంచు ఫ్యామిలీ కలల ప్రాజెక్ట్ కన్నప్ప నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాను చూసింది ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ తల్లి.. మాజీ శాసనసభ సభ్యురాలు YS విజయమ్మ!. హైదారాబాద్లోని ఏషియన్ మహేశ్ బాబు మాల్(AMB)కి వెళ్లిన YS విజయమ్మ, మంచు విష్ణు భార్య విరానికా కన్నప్ప సినిమాను కలిసి వీక్షించారు. సినిమా అనంతరం విజయమ్మ బయటికి వెళుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రభాస్ చాలా బాగా చేసాడు
రేటింగ్ 3.25/5
కనప్ప ను AMB లో చూసిన వైస్ విజయమ్మ #Kannappa#KannappaReview#KannappaMovie#KannappaMovieReview#VishnuManchu#Prabhas pic.twitter.com/v6xInQJpKd— @ANCHOR VENKAT (@CinemaPosts) June 27, 2025