RGV | సినీరంగంలోకి రావాలనుకునే ఔత్సాహికులను ప్రోత్సహించడమే ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యమని చెప్పారు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ కాంటెస్ట్ వివరాలను వెల్లడించారు. రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ ‘ప్రతిభ ఉండి ప్రపంచానికి తెలియాల్సిన వారు చాలా మంది ఉన్నారు.
ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ అవకాశాలను పొందలేకపోతున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ కాంటెస్ట్‌ను నిర్వహించాం. దీనికి 400 ఎంట్రీలు వచ్చాయి. వీటిని షార్ట్‌లిస్ట్ చేసి 11 షార్ట్‌ఫిల్మ్స్‌ను ఎంపిక చేశాం. సోషల్‌మీడియాలో ఓటింగ్ నిర్వహించి బెస్ట్ డైరెక్టర్‌గా ఎంపికైన వారికి మా సంస్థలో అవకాశం ఇవ్వబోతున్నాం. ఒక్క డైరెక్షన్ విభాగంలోనే కాదు కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్షన్ ఇలా ప్రతి క్రాఫ్ట్‌లో టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేస్తున్నాం. లఘు చిత్రాల్లో నిర్మాణ విలువల కంటే కాన్సెప్ట్‌ను ఎంత బాగా ప్రజెంట్ చేశారనే అంశాన్నే పరిగణలోకి తీసుకున్నాం’ అన్నారు.