గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అవార్డులు దక్కించుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. వివిధ విభాగాల్లో పురస్కారాలు సైతం అందుకుంది ఆర్ఆర్ఆర్. కాగా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరో పురస్కారాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022 (New York Film Critics Circle Awards 2022)లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు జక్కన్న. అవార్డు అందుకున్న సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. మీరంతా దక్షిణాది నుంచి వచ్చిన ఓ చిన్న సినిమాను చాలా మంది జనాలు గుర్తించేలా చేశారు. ఇది చాలా గొప్ప అనుభూతిని అందించే సందర్భం. నా ఆడియెన్స్ కూడా ఇదే అనుభూతి పొందాలని కోరుకుంటున్నానన్నాడు.
సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకుల ముఖాల్లో చూసిన ఎక్జయిట్మెంట్ను అవార్డు అందుకున్న నేపథ్యంలో గుర్తు చేసుకున్నాడు. ఎపిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాంచరణ్ నటించగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమ్రం భీం పాత్రలో నటించాడు. ఉక్రెయిన్ భామ ఒలీవియా మొర్రీస్, బాలీవుడ్ భామ అలియాభట్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించారు. శ్రియా శరణ్, అజయ్ దేవ్గన్ కీలక పాత్రల్లో నటించారు.
ఎస్ఎస్ రాజమౌళి స్పీచ్.. వీడియో
India's Pride @ssrajamouli Garu Received Best Director Award at @nyfcc ❤️🔥❤️🔥. #RRRMovie #RRRForOscars @RRRMoviepic.twitter.com/xx6vqHx33F
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) January 5, 2023
BEST DIRECTOR! ❤️🔥❤️🔥❤️🔥@ssrajamouli
@nyfcc pic.twitter.com/igF8221bqm— S S Karthikeya (@ssk1122) January 5, 2023