Pradeep Ranganathan | డ్యూడ్ సినిమా ఈవెంట్లో తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ని ఒక అనుచిత ప్రశ్నతో తెలుగు లేడి ఫిలిం జర్నలిస్ట్ ఇబ్బందిపెట్టిన విషయం తెలిసిందే. మహిళ జర్నలిస్ట్ ప్రదీప్ రంగనాథన్ని ఉద్దేశించి అడుగుతూ.. మీరు హీరో మెటీరియాలా ? మీరు హీరోలా కనిపించరు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రశ్నకు ప్రదీప్ బదులిస్తుండగా పక్కనే ఉన్న నటుడు శరత్ కుమార్ మైక్ తీసుకుని సదరు జర్నలిస్ట్‌కి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చాడు. మీరు ఎవరిని హీరో అని జడ్జ్ చేయకుడదు. ఇక్కడ ఉన్నవారందరూ వారికి వారు హీరోలే. సమాజంకి మంచి చేసే వ్యక్తి ఎవరైన కూడా హీరోనే అంటూ శరత్ చెప్పుకోచ్చాడు. దీంతో ఈ వీడియో చాలా వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఈ విషయంలో ప్రదీప్‌కి చాలామంది నెటిజన్లు మద్దతును తెలుపుతూ లేడి జర్నలిస్ట్‌ను తప్పుబడుతున్నారు. మరోవైపు ఆ లేడి జర్నలిస్ట్‌పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
అయితే డ్యూడ్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను అందుకోగా.. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్లో పాల్గోన్నాడు ప్రదీప్. అయితే ప్రదీప్‌ను ఉద్దేశించి ఒక తెలుగు అభిమాని మాట్లాడుతూ.. మా తెలుగు ప్రేక్షకుల తరపున మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ‘మీరు హీరో మెటీరియల్’. మిమ్మల్ని మేము లవ్ చేస్తున్నాం. అలాగే మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం అంటూ అభిమాని చెప్పుకోచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Haha 😂
Slipper shot to someone 🤭#Dude pic.twitter.com/JmrESj9K1z— Veeeraaa 🦅 (@NAYAKBHAIII) October 21, 2025
You Cannot say A to Z, who is the HERO MATERIAL
Everybody is Hero 🙌#SarathKumar Speech @ #Dude Pre release event 👏
— Prakash Mahadevan (@PrakashMahadev) October 15, 2025