Devaki Nandana Vasudeva | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) ప్రస్తుతం Ashok Galla 2 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రానికి గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి దేవకీ నందన వాసుదేవ టైటిల్ ఫిక్స్ చేశారు. కాగా ఈ సినిమా టైటిల్‌ను ఫైనల్ చేస్తూ.. మేకర్స్ లాంఛ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. నీ బిడ్డకు మరణగండం.. లేదా అతని చేతిలో మరొకరికి మరణం అంటూ సాగే డైలాగ్స్‌తో షురూ అయిన టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
అశోక్గల్లాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. Yeamayyinde సాంగ్ ప్రోమోను ఇవాళ సాయంత్రం 4 :05 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని షేర్ చేస్తూ రిలీజ్ చేసిన అశోక్ గల్లా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి
జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ కథనందిస్తుండటం విశేషం. మేకర్స్ చాలా రోజుల క్రితం లాంఛ్ చేసిన ఫస్ట్ యాక్షన్ వీడియోలో.. బురదలో జరిగే ఫైట్ సన్నివేశంతో కట్ చేసిన ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అవుతోంది. యూనిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో అశోక్ గల్లా మాస్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది.
ప్రొడక్షన్ నంబర్ వన్‌గా వస్తోన్న ఈ మూవీని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్ఆర్ఐ) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ కాగా తమ్మిరాజు ఎడిటర్. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల చివరగా డైరెక్ట్ చేసిన గుణ 369 బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు అర్జున్ జంధ్యాల.
Yeamayyinde సాంగ్ ప్రోమో అప్డేట్..
Team #DevakiNandanaVasudeva extends warm birthday wishes to our hero @AshokGalla_ ❤️
Unveiling the 1st single #Yeamayyinde promo today @ 4:05PM 🕓#HBDAshokGalla@varanasi_manasa @ArjunJandyala @PrasanthVarma @DevdattaGNage #BheemsCeciroleo #RasoolEllore @balasomineni pic.twitter.com/9cxSspQzfG
— Sri Lalithambika Productions (@lalithambikaoff) April 5, 2024
సంభవామి యుగే యుగే 🙏🏻
Witness the massive clash of Good vs Evil 🔥#AshokGalla2 is titled as #DevakiNandanaVasudeva ❤️🔥#DNV Teaser out now💥
– https://t.co/WBTBFeT5dL@AshokGalla_ @varanasi_manasa @DevdattaGNage @ArjunJandyala @PrasanthVarma @bheemsceciroleo #RasoolEllore… pic.twitter.com/IEj9hrKlMs— BA Raju’s Team (@baraju_SuperHit) January 10, 2024
దేవకీ నందన వాసుదేవ టీజర్..
ఫస్ట్ యాక్షన్ వీడియో..
అశోక్ గల్లా కొత్త సినిమా లాంఛింగ్ స్టిల్స్..
#AshokGalla2 Launched with a formal pooja ceremony❤️
Clap by @VenkyMama
1st shot Dir #BoyapatiSreenu
🎥Switch On #NamrataGhattamaneni
📝 #MiryalaRavinderReddy@PrasanthVarma @sahugarapati7 @harish_peddi@AshokGalla_ @ArjunJandyala #BheemsCeciroleo #SBalakrishna @lalithambikaoff pic.twitter.com/7zytDh18aC— BA Raju's Team (@baraju_SuperHit) February 5, 2023