Bigg Boss 8 Telugu | ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ షురూ అయ్యింది. షో ప్రారంభం కాగానే హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. దేవర మూవీలోని ఫియర్ సాంగ్‌కు డ్యాన్ చేస్తూ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. లిమిట్లెస్ అంటూ షోను ప్రారంభించారు. అనంతరం బీబీహౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఏమేం ఉన్నాయో అందరికీ చూపించారు. ఈ సీజన్లో స్పెషల్ రూమ్ అలియాస్ ఇన్ఫినిటీ రూమ్ ఉందని చెప్పారు. గోల్డెన్ రూమ్ (స్ట్రేటజీస్ ప్లే చేసే రూమ్), తూనీగ రూమ్ అని.. కష్టంతో పాటు అదృష్టం ఉంటే తప్ప ఇందులోకి రాలేరన్నారు. పికాక్ జాతీయ పక్షి అని.. ఆడే బలం, ఆలోచించే పవర్ ఉండాలన్నారు. జీబ్రా రూమ్.. ఎవరికీ లొంగకుండా, మాట పొగరుకు భయపడకుండా ఉండేవాళ్లే ఈ రూమ్‌లోకి వస్తారన్నారు. అనంతరం బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్స్‌ని ఆహ్వానించారు. తొలి కంటెస్టెంట్‌గా యష్మీ గౌడ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో స్వాతిచినుకులు, నాగభైరవి, కృష్ణ ముకుంద మురారి తదితర సీనియల్స్‌లో నటించింది. ఎనిమిదో సీజన్లోకి ఎంట్రీ ఇచ్చిన యష్మీని నాగార్జున అభిమానులకు పరిచయం చేసింది.
యష్మీ గౌడ స్వస్థలం కర్ణాటక రాజధాని బెంగళూరు. ఆమె తండ్రి రమేశ్. ఆయనకు సొంత ఫ్యాక్టరీ ఉంది. తల్లి విజయలక్ష్మి గృహిణి కాగా.. ఆమె హోంమేకర్. యష్మీ ఇంట్లో గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీ నేపథ్యం లేదు. యష్మీ గౌడకు చిన్నతనం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే మక్కువ. స్కూల్ డేస్ నుంచి ఆవిడకు స్కిట్స్, డ్యాన్స్ చేస్తూ వచ్చేది. నటి కావాలని బాల్యం నుంచి బలమైన కోరికతో బెంగళూరులోని ‘దయానంద్ సాగర్ ఇన్స్టిట్యూట్’లో సివిల్ ఇంజినీరింగ్ చదివింది. కాలేజీ డేస్ నుంచే మోడలింగ్ స్టార్ట్ చేశారు. ఒక మోడలింగ్ షో కోసం ఆమె కాలేజీలో ఆడిషన్స్ నిర్వహించిన సమయంలో యష్మీ గౌడ ఎంపికైంది. అందాల పోటీల్లో ‘మిస్ ఫొటోజెనిక్’, ‘మిస్ మైసూర్’ టైటిల్స్ నెగ్గింది. స్నేహితుల సలహా మేరకు సీరియల్ ఆడియన్స్‌కు వెళ్లింది. తొలి ప్రయత్నంలోనే అవకాశం దక్కించుకుంది. కన్నడంలో సీనియల్స్ చేస్తున్న సమయంలో తెలుగులోనూ అవకాశాలు దక్కించుకున్నది.
🌟 The stunning Yashmi’s grand entrance at the Bigg Boss Telugu 8 grand launch! 🔥✨ Get ready for a spectacular start to the new season. Stay tuned to @StarMaa and @DisneyPlusHSTel to catch all the excitement! 📺🎉 #BiggBossTelugu8 #GrandLaunch #YashmiOnBB8 pic.twitter.com/P6nc7YgMWr
— Starmaa (@StarMaa) September 1, 2024