ప్రదీప్‌రెడ్డి, శివనాయుడు, గోవా జ్యోతి ప్రధానపాత్రధారులుగా రూపొందిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘యజ్ఞ’. చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. చిలుకోటి రఘురామ్, చీలపల్లి విఠల్‌గౌడ్ నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, సాయివెంకట్‌లు అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
హారర్ కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. ఎన్నో అవరోధాలను అధిగమించి ఈ సినిమా విడుదలకు సిద్ధమైందని, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మంతో ఉన్నామని దర్శకుడు చిత్తజల్లు ప్రసాద్ తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: జి.కృష్ణనాయుడు, సుధాకర్ నాయుడు కె., సంగీతం: లక్ష్మణ్‌సాయి, నిర్మాణం: ఆర్.ఆర్.మూవీ క్రియేషన్స్, రేణుక ఎల్లమ్మ ఫిల్మ్స్.