Y.S Sharmila | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నటుడు ప్రభాస్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ అంటే ఎవడో తనకు తెలియదని వెల్లడించింది. ప్రభాస్‌కి షర్మిలకి మధ్య రిలేషన్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. తనకు అసలు ప్రభాస్ అంటే ఎవరో తెలియదని.. నాకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. ఆరోజు ఇదే చెప్పాను. ఇప్పుడు ఇదే చెబుతున్నాను. తాను ఎవరో నాకు తెలియదు. ఈ విషయంపై నా పిల్లల మీద కూడా ప్రమాణం చేశాను. ఈ విషయంపై జగన్ మోహన్ రెడ్డి 5 ఏండ్లు సీఎంగా ఉండికూడా దీనిపై విచారణ జరిపించలేదు. బాలకృష్ణపై ఎందుకు చర్యలు తీసుకులేదు అని నేను అడుగుతున్నా.
నీకు నిజంగానే చెల్లెలి మీద ప్రేమ ఉంటే.. బాలకృష్ణ నా మీద ప్రభాస్ మీద ఆరోపణలు చేసినప్పుడు ఏం చేశావు. అప్పుడు ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంపై జగన్ ఎటువంటి చర్యలు తీసుకుపోగా.. నన్ను సోషల్ మీడియాలో మీ పార్టీ కార్యకర్తలతో తిట్టించారు. నేను కేసు పెట్టినప్పుడు కూడా దీనిపై అసలే స్పందించలేదంటూ షర్మిల వెల్లడించింది.