బాలీవుడ్లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. బాలీవుడ్ ఖాన్లంతా (షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్) ఒకే చోట కలిశారు. ఇంకా వీరితో పాటు ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న ప్రపంచ నంబర్ వన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (MrBeast – జిమ్మీ డోనాల్డ్సన్) కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
ఈ అరుదైన ఫోటో సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ‘జాయ్ ఫోరం 2025’ (Joy Forum 2025) అనే అంతర్జాతీయ ఈవెంట్లో తీసినట్లు తెలుస్తోంది. ఫోటోలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ సూట్లలో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుండగా, అమీర్ ఖాన్ బ్లాక్ కుర్తా, వైట్ ప్యాంట్లో కనిపించాడు.ఇక మిస్టర్ బీస్ట్ నలుపు రంగు బట్టల్లో కనిపించాడు. ఈ ఫోటోను మిస్టర్ బీస్ట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ హే ఇండియా, మనమందరం కలిసి ఏదైనా చేయాలా? అని క్యాప్షన్ ఇచ్చాడు. అయతే దీనికి నెటిజన్లు వావ్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మిస్టర్ బీస్ట్ ఖాన్‌లతో ఎదైన షో ప్లాన్ చేశాడా అంటూ కామెంట్లు పెడుతున్నారు. యూట్యూబ్‌లో అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్నవారిలో మిస్టర్ బీస్ట్(440 మిలియన్ సబ్స్క్రైబర్లు) మొదటి స్థానంలో ఉండగా బాలీవుడ్‌కి చెందిన టీ సిరీస్(305 మిలియన్ సబ్స్క్రైబర్లు)తో రెండో స్థానంలో ఉంది.
is mr beast doing the aryan khan challenge? 👀 https://t.co/bKLZ9The8V
— Netflix India (@NetflixIndia) October 17, 2025