Samantha | వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ చెన్నై ఫ్రాంఛైజీని కొనుగోలు చేసినట్లు అగ్ర కథానాయిక సమంత ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తన జీవితంలో ఇదొక కొత్త ఆరంభమని ఆనందం వ్యక్తం చేసింది. తాజాగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో పికిల్‌బాల్ గేమ్ ఆడుతున్న వీడియో ఒకటి షేర్ చేసింది. ఇందులో సమంత ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించింది.
ఈ వీడియోను చూసిన వారు గేమ్ పట్ల సమంత పట్టుదల చూసి ఆశ్చర్యపోతున్నారు. చిన్నతనం నుంచి తనకు ఆటలంటే చాలా ఇష్టమని, ఫ్రాంఛైజీని కొనుగోలు చేయడంతో తన కల నెరవేరిందని సమంత పేర్కొంది. ‘పాఠశాల రోజుల్లో స్పోర్ట్స్‌పై ఎంతో మక్కువ ఉండేది. అయితే నా పేరెంట్స్ మాత్రం ఆటలపై దృష్టి పెడితే చదువును నిర్లక్ష్యం చేస్తానేమోనని భయపడేవారు.
అలా ఆటలకు దూరమయ్యాను. ఆ తర్వాత స్పోర్ట్స్ విలువేమిటో తెలిసొచ్చింది. అవి మనల్ని ఆరోగ్యంగా వుంచడమే కాకుండా ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని సాగించేలా ధైర్యాన్నిస్తాయి’ అని సమంత చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నది. ఇక సినిమాల విషయానికొస్తే స్వీయ నిర్మాణంలో సమంత ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నది.