న్యూఢిల్లీ: హురున్ సంపన్నుల జాబితాను రిలీజ్ చేశారు. ఆ జాబితాలోకి బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్(Shah Rukh Khan) ఎంట్రీ ఇచ్చారు. షారూక్ ఆస్తులు 7300 కోట్లు ఉంటుందని హురున్ తన జాబితాలో పేర్కొన్నది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ లో షారూక్‌కు భాగస్వామ్యం ఉన్నది. కోల్‌కతా జట్టు ఈ ఏడాది ఐపీఎల్ గెలిచిన విషయం తెలిసిందే. షారూక్ సంపద పెరగడానికి ఇది కీలకమైంది.
ఎక్స్ అకౌంట్లోనూ షారూక్‌కు ప్రత్యేక స్థానం ఉన్నది. అతనికి ఎక్స్‌లో 44.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అనేక మంది బిలియనీర్లు, సెలబ్రిటీలను అతను దాటేశాడు. సెలబ్రిటీల్లో బాలీవుడ్ నటి జూహీ చావ్లా కూడా హురున్ సంపన్నుల జాబితాలో చోటు సంపాదించింది. ఆమె సంపద 4600 కోట్లుగా ఉంది. హృతిక్ రోషన్ ఆస్తి సుమారు రెండు వేల కోట్లుగా ఉన్నది. కోల్‌కతా జట్టులో షారూక్‌తో పాటు చావ్లా వ్యాపార భాగస్వామిగా ఉన్నది. హృతిక్ రోషన్‌కు హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ ఉంది.
హురున్ లిస్టులో అమితాబ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని సంపద 1600 కోట్లుగా ఆ లిస్టులో చూపించారు. డైరెక్టర్ కరణ్ జోహార్ సంపద 1400 కోట్లు. హురున్ ఇండియా రిచ్ లిస్టు ప్రకారం.. భారత్‌లో 1539 మంది వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ కలిగి ఉన్నారు. హురున్ సంపన్నుల జాబితాలో వ్యాపారవేత్త గౌతం అదానీ అగ్ర స్థానంలో నిలిచారు. అతని సంపద 11.6 ట్రిలియన్లుగా ఉంది.