Samantha | బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారుఖ్‌ఖాన్‌కు ప్రపంచ్యవాప్తంగా ఫ్యాన్ బేస్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ బీటౌన్ బాద్షా అభిమానుల్లో స్టార్ సెలబ్రిటీలు కూడా ఉంటారు. వారి జాబితాలో టాప్‌లో ఉంటుంది చెన్నై సోయగం సమంత (Samantha) . కింగ్ ఆఫ్ రొమాన్స్‌కు సామ్ వీరాభిమాని అని తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో తనకు షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) తో కలిసి పనిచేయాలని ఉందని కూడా చెప్పింది.
ఎప్పటినుంచో సామ్ మనసులో ఉన్న కోరిక నెరవేరనుందా..? అంటే అవుననే అంటున్నాయి తాజా వార్తలు. షారుఖ్‌ఖాన్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ చేయనున్న సినిమాలో సామ్‌ను తీసుకుంటున్నారని బీటౌన్‌లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే రాజ్‌కుమార్ హిరానీతో సమంతకు ఇది మొదటి సినిమా కానుండగా.. డంకీ తర్వాత షారుఖ్‌ఖాన్ రెండో మూవీ కానుంది.
ప్రస్తుతానికి అధికారిక ప్రకటన ఏం రాకున్నా మూవీ లవర్స్, అభిమానులు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీ అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే దేశభక్తి నేపథ్యంలో రానున్న మరో యాక్షన్ ప్యాక్డ్ సినిమా కానుందట. మరి దీనిపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. సమంత ప్రస్తుతం బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్‌తో కలిసి సిటడెల్ వెబ్‌సిరీస్‌లో నటిస్తుందని తెలిసిందే.
