Ali Reza :మాకు అందుకే అవకాశాలు రావట్లేదు..బిగ్ బాస్ 3 ఫేమ్ అలీ రెజా కామెంట్స్
Ali Reza | కరోనా వచ్చి తమ ఆశలపై నీళ్లు చల్లిందని అలీ రెజా ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్లు బయటకు వచ్చిన సంగతి కూడా పట్టించుకోలేదు అన్నాడు.

సాధారణంగా బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కంటెస్టెంట్లకు పాపులారిటీ చాలానే ఉంటుంది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్లు స్టార్స్ అయిపోతున్నారు. కానీ ఆ క్రేజ్ వాళ్ల కెరీర్‌కు మాత్రం ఉపయోగపడటం లేదు. బిగ్‌బాస్ షోలో గెలిచినా బయట అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా బిగ్‌బాస్ 3 తెలుగు కంటెస్టెంట్స్ అయితే కనీసం కనిపించడం లేదు. విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, రన్నరప్ శ్రీముఖి ముందు నుంచే స్టార్స్ కాబట్టి వాళ్ల కెరీర్ అలాగే నడుస్తుంది. కానీ వరణ్ సందేశ్ సహా మిగిలిన వాళ్లు అయితే ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు. ఇక బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్లు మాత్రం ఫర్వాలేదు అనిపిస్తున్నారు. సొహైల్, అఖిల్ వంటి వాళ్లు సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అలీ రెజా ( Ali Reza ) స్పందించాడు. కరోనా వచ్చి తమ ఆశలపై నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

‘ బిగ్‌బాస్ సీజన్ 3 కంటెస్టెంట్లతో పోలిస్తే సీజన్ 4 వాళ్లకు చాలా తేడా ఉంది. వాళ్లకు మంచి అవకాశాలు వస్తున్నాయి. మాకు రావడం లేదు. మేం బయటకు వచ్చి హ్యాపీగా సినిమాలు, సీరియల్స్‌తో బిజీ అయ్యే సమయానికి కరోనా వల్ల లాక్డౌన్ ప్రకటించారు. నిజానికి బిగ్‌బాస్ షో తర్వాత కంటెస్టెంట్లకు వచ్చే హైప్ కొన్నాళ్లు మాత్రమే ఉంటుంది. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలి. కానీ మాకు హైప్ ఉన్న ఆ నాలుగు నెలల్లోనే కరోనా వచ్చింది. మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టేసింది. దీంతో బయటకు వెళ్లి ఏదైనా చేసుకునే అవకాశం దొరకలేదు. మేం బయటకు వచ్చిన సంగతి కూడా చాలామంది పట్టించుకోలేదు. ఇదే లాక్డౌన్ టైంలో బిగ్‌బాస్ సీజన్ 4 కూడా వచ్చేసింది’ అని చెప్పుకొచ్చాడు అలీ రెజా.

బిగ్ బాస్ 3 లో మెయిన్ కంటెస్టెంట్ గా ఉన్న అలీ రెజా ( Ali Reza ) వైల్డ్ డాగ్ సినిమాతో నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగార్జున రిఫెరెన్సుతోనే వైల్డ్ డాగ్ సినిమాలో ఈయన నటించాడు. ఇందులో NIA ఏజెంట్ గా నటించాడు అలీ రెజా. ఏదేమైనా కూడా కేవలం లాక్ డౌన్, కరోనా కారణంగా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ కనీసం ఉన్నట్లు కూడా ఎవరూ పట్టించుకోలేదని చెప్పాడు ఈయన.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
ఇవి కూడా చదవండి..
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్
కరోనాతో ప్రముఖ తమిళ దర్శకుడు మృతి
అల్లు అర్జున్ మీ అంచనాలు దాటేస్తాడు: రష్మిక
పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు.. . ‘వకీల్ సాబ్’ ఓటిటి డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
వకీల్ సాబ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందా?
కరోనాతో సీనియర్ నటి భర్త మృతి
అఫీషియల్: ఆచార్య చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన నిర్మాణ సంస్థ
మూడో హిందీ చిత్రానికి రష్మిక గ్రీన్ సిగ్నల్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

