కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా గురించి ఓ ఇన్ ఫర్మేషన్ ఇచ్చింది రష్మిక. ఫ్యాన్స్ తో చేసిన ఇంటరాక్షన్ లో పుష్ప టీం ఎలాంటి అంచనాలకు చేరుకుంటుందో తెలుసుకునేందుకు ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నానంది. అంతేకాదు ఎలాంటి అంచనాలనైనా అధిగమించే యాక్టర్ కేవలం అల్లు అర్జున్ మాత్రమేనని చెప్పింది.
అల్లు అర్జున్ స్టామినా ఏంటో సుకుమార్ టీజర్ లోనే చూపించాడని పేర్కొంది. రష్మిక పుష్పలో బన్నీ లవర్ గా కనిపించనుంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్
థియేటర్ కు వెళ్లకుండా రాధే చూడాలంటే..?
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల