వకీల్ సాబ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందా?

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అయినా చేయాలని దర్శకుడు కలలు కనే వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఒకసారి ఆయనతో సినిమా చేస్తే మళ్లీ మళ్లీ చేయొచ్చు అని నమ్మకం కలిగిస్తున్నాడు పవన్ కళ్యాణ్. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలని పవర్ స్టార్ ఏ రోజు అనుకోలేదు. ఎందుకో వాళ్లకు ఈయనకు సరైన వేవ్ లెంత్ కుదరదు. డేట్స్ అడ్జెస్ట్ కాక కొందరు.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ బ్యాలెన్స్ చేయలేక మరికొందరు స్టార్ డైరెక్టర్లు ఆయనతో పని చేయడం మానేశారు. త్రివిక్రమ్ మినహా పవన్ కళ్యాణ్ తో ఈ మధ్య కాలంలో పెద్ద దర్శకుడు పని చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఆయన వరుసగా కుర్ర దర్శకులతో పని చేస్తున్నాడు.
ఈ మధ్య వకీల్ సాబ్ సినిమాను రెండు సినిమాలు అనుభవమున్న వేణు శ్రీరామ్ తెరకెక్కించాడు. ప్రస్తుతం సాగర్ కే చంద్రతో పని చేస్తున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్, క్రిష్ లాంటి దర్శకులు ఉన్నారు. సురేందర్ రెడ్డి కూడా లైన్ లోనే ఉన్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలపై మరో వార్త కూడా బయటికి వస్తుంది. ఈయన మరో సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించిన వేణు శ్రీరామ్ కు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
ఈ మధ్య పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా ఒకసారి పని చేసిన దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నాడు. డాలి ఇలాగే రెండు సినిమాలు ఆయనతో చేశాడు. అలాగే ఇప్పుడు హరీష్ శంకర్ కు మరోసారి అవకాశం ఇచ్చాడు. ఈ క్రమంలోనే వేణు శ్రీరామ్ పనితీరు మెచ్చిన పవన్ కళ్యాణ్.. మరోసారి ఆయనకు అవకాశం ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ లో దిల్ రాజు సినిమా నిర్మిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి డేట్స్ కూడా తీసుకున్నాడు దిల్ రాజు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇది ఉంటుందని వార్తలు వినిపించినా కూడా ఇప్పుడు వేణు శ్రీరామ్.. పవన్ కళ్యాణ్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
భారత్కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్
కాస్త తగ్గినయ్.. కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు
ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం
పీపీఈ కిట్లో పెళ్లి.. వైరల్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

