e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home News ముక్కలైపోతున్న మా అసోసియేషన్.. సో కాల్డ్ సినీ పెద్దలేం చేస్తున్నారో..?

ముక్కలైపోతున్న మా అసోసియేషన్.. సో కాల్డ్ సినీ పెద్దలేం చేస్తున్నారో..?

MAA Elections Controversy | prakash raj | manchu vishnu | mohan babu
MAA Elections Controversy

MAA Elections Controversy | మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి మేమంతా ఒక్కటే.. ఇప్పుడు గొడవలు పడిన కూడా ఎన్నికల తర్వాత అందరం కలిసే ఉంటాం అంటూ.. మొన్నటి వరకు కబుర్లు చెప్పిన సినిమా సభ్యులు.. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూసిన తర్వాత ఏం చేయాలో తెలియక బిక్క మొహం వేసుకుని కూర్చున్నారు. వాళ్లలో వాళ్ల‌కి అసలు పడక మీడియా ముందుకు వచ్చి ఒకరి పరువు ఒకరు తీసుకుంటున్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీరు ఎదవలు అంటే.. కాదు మా కంటే పెద్ద ఎదవ మీరే అంటూ బూతులు కూడా మాట్లాడుకుంటున్నారు. మొన్నటికి మొన్న జరిగిన మా అసోసియేషన్‌ ఎలక్షన్స్‌లో మోహన్ బాబు ( mohan babu ) అక్కడ ఉన్న వాళ్లందరినీ తన మాటలతో.. కాదు కాదు బూతులతో కంట్రోల్ చేశాడు. దీని తరువాత మా అసోసియేషన్‌ రెండు ముక్కలు అయిపోయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అన్నింటికీ మించి మంచు విష్ణు వర్గం గెలిచిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేయడంతో విషయం మరింత పెద్దది అయిపోయింది. కూర్చొని మాట్లాడుకుందాం అని మంచు విష్ణు చెబుతున్నా కూడా.. నీతో కూర్చుని మాట్లాడుకునేది ఏమీ లేదు.. మేం పక్కకి తప్పుకుంటాం.. మీరు చేసేది చూస్తూ ఉంటాం.. మీరు చేయండి మీరు చేసే పనులకు మేము అడ్డు రాము అంటూ పక్కకు వెళ్లిపోయారు. ఇదంతా చూస్తుంటే సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కే ఒకింత అస‌హం వ‌స్తుంది. అలాంటిది ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఏం చేస్తున్నారు.. ఇంత గొడవ జ‌రుగుతుంటే బయటికి వచ్చి కనీసం వివాదం సద్దుమణిగేలా చేయాలనే విషయం తెలియదా అంటూ సగటు సినీ అభిమాని ప్రశ్నిస్తున్నాడు. ఎంతసేపు మేమంతా ఒక్కటే అని కబుర్లు చెప్పడం కాదు.. ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి కదా అంటూ విశ్లేషకులు కూడా సినిమా ఇండస్ట్రీపై విమర్శల దాడి చేస్తున్నారు. ఏదైనా కూడా చాలా రోజుల తర్వాత మా అసోసియేషన్ ఎన్నికలతో సినిమా ఇండస్ట్రీ పరువు దిగజారిపోయిందనేది మాత్రం కాదనలేని నిజం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

కాను కానంటూనే సినీ పెద్దవుతున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు !

Mohan Babu | నోరుంది క‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడొద్దు: మోహ‌న్ బాబు

Chiranjeevi | మా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై చిరంజీవి సెన్సేష‌న‌ల్‌ కామెంట్స్‌

Nagendra Babu | నాగ‌బాబు రాజీనామా..దాసరి లోటు మోహ‌న్‌బాబు భ‌ర్తీ చేస్తార‌న్న న‌రేశ్‌

Prakash Raj | అతిథిగానే ఉండాలంటున్నారు: ప్రకాశ్ రాజ్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement