Nagendra Babu | నాగబాబు రాజీనామా..దాసరి లోటు మోహన్‌బాబు భర్తీ చేస్తారన్న నరేశ్
ప్రకాశ్‌రాజ్ ఓడిపోయిన తర్వాత నాగబాబు (Nagendra Babu) మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘మా’ సభ్యత్వానికి నాగబాబు రాజీనామా చేస్తూ.. తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘మా’ ఎన్నికల (Maa Elections)ప్రక్రియ ముగిసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రకాశ్‌రాజ్ ఓడిపోయిన తర్వాత నాగబాబు (Nagendra Babu) మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘మా’ సభ్యత్వానికి నాగబాబు రాజీనామా చేస్తూ.. తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రకాశ్‌రాజ్‌కు తానెప్పుడూ అండగా ఉంటానని నాగబాబు లేఖలో పేర్కొన్నారు.
ఈ ఎన్నికలు మాలో చీలికకు కారణమయ్యాయి. ప్రాంతీయవాదం, సంకుచిత భావాలు కలిగిన వారు గెలిచారని నాగబాబు అన్నారు. మా భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తుంది. ఇలాంటి అసోసియేషన్ లో కొనసాగకూడదనే రాజీనామా చేశానని లేఖలో తెలిపారు నాగబాబు.
జరిగిన పరిణామాలకు హర్ట్ అయ్యి నాగబాబు రాజీనామా చేశారని మా మాజీ అధ్యక్షుడు నరేశ్ (Naresh) అన్నారు. అందర్నీ కలుపుకొని పోవాలి. జయసుధను పెడదామన్నాను. నాగబాబు పట్టించుకోలేదు. నిన్న చిరంజీవి ఎవరి గురించి మాట్లాడారో ఆయనే చెప్పాలి. అందర్నీ కలుస్తాం. కలిసి పనిచేస్తాం. మా ఒక సేవా సంస్థ అని నరేశ్ స్పష్టం చేశారు. దాసరి లోటు మోహన్‌బాబు భర్తీ చేస్తారని నరేశ్ చెప్పుకొచ్చారు. అయితే దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ.. ఆ స్థానం తనకొద్దని, దాసరి లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని, తీర్చలేరని అన్నారు.
ఇవి కూడా చదవండి..
Mohan Babu | నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు: మోహన్ బాబు
Manchu Vishnu | నాగబాబు రాజీనామా ఆమోదించం: మంచు విష్ణు
Chiranjeevi | మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

