లతా మంగేష్కర్ పెండ్లి చేసుకోకపోవడానికి కారణమేంటి.. ఒంటరిగా ఎందుకు ఉండిపోయారు..?
Lata Mangeshkar | ఇండియన్ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం అందరినీ కలిచి వేస్తోంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గాన కోకిల.. వయోభారంతో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్ను మూశారు. ఇదిలా ఉంటే ఈమె వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అందులోనూ ఈమె పెండ్లి ఎందుకు చేసుకోలేదు అనే విషయం గురించి ప్రస్తుతానికి అందరూ ఆరా తీస్తున్నారు. 92 ఏండ్ల జీవితాన్ని ఒంటరిగా గడిపారు లతా మంగేష్కర్. ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఈమెను చాలా సార్లు ఎన్నో ఇంటర్వ్యూలలో ఎంతో మంది అడిగారు. కానీ అన్నింటికీ నవ్వుతూనే సమాధానం చెప్పారు లతా జీ.
మనసు ఒకటే చెబుతుంది.. దాంతో పాటే మనం కూడా వెళ్లాలి అంటూ సమాధానం ఇచ్చేవారు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటేనే ఒక ఆడదానికి సంపూర్ణత్వం వస్తుందని ఎవరైనా మాట్లాడితే.. వాటిని అసలు పట్టించుకోవద్దు అని చెప్పేవాళ్లు లతా మంగేష్కర్. నీ మనసు చెప్పినట్టు నువ్వు ముందడుగు వేయి.. అంతే కానీ ఈ ప్రపంచం కోసం నువ్వు బతకాల్సిన అవసరం లేదు అంటూ ఈమె చెప్పేవాళ్లు. తన జీవితం మొత్తం అదే చేశానని.. బయట ప్రపంచం కోసం నటించాల్సిన అవసరం లేదు అని కుండబద్దలు కొట్టే వాళ్లు లతాజీ. పెండ్లి విషయంలో కూడా చివరి వరకు ఈమె ఇదే ఆలోచనతో ఉన్నారు. పెండ్లి, పిల్లలు ఇలా బహిర్గత సంతోషం కంటే మానసిక ప్రశాంతత తనకు ముఖ్యమని.. లోపల అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాను అని చాలాసార్లు చెప్పారు లతా.
73 ఏళ్ల కెరీర్లో వివాదాలకు దూరంగా ఉంటూ అభిమానులకు చాలా దగ్గరగా ఉన్నారు లతా మంగేష్కర్. కొన్నిసార్లు పెళ్లి విషయంలో పుకార్లు వచ్చినా కూడా వాటిని నవ్వుతూ స్వీకరించారు. సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. అనవసరమైన తలనొప్పులు మనసులోకి తీసుకుంటే ప్రశాంతత చెడిపోతుందని.. ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళదే కాబట్టి పక్క వాళ్ల కోసం బతకాల్సిన అవసరం లేదు అంటూ స్వతంత్ర భావజాలంతో ఉండేవాళ్లు లతా మంగేష్కర్.
2013సంవత్సరంలో చివరగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు లతా మంగేష్కర్. మన సంతోషం కోసం తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు అవతలి వాళ్లకు బాధ కలిగించినా కూడా.. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలిస్తే చాలు అని చెప్పారు. చివరి వరకు కూడా అదే భావాలతో ఉన్నారు లతా మంగేష్కర్.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
1950ల్లో ఒక్కో పాటకు లతాజీ ఎంత రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు..?
పాట పాడుతూ కింద పడిపోయిన లతా మంగేష్కర్.. ఈ సంఘటన గురించి తెలుసా..?
Lata Mangeshkar | సినీ అభిమానుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే లతా మంగేష్కర్ పాటలు ఇవే
Lata Mangeshkar | తెలుగులో మూడే పాటలు పాడిన లతా మంగేష్కర్.. కారణం ఏంటో తెలుసా?
Lata Mangeshkar | వరల్డ్ కప్ గెలిచిన జట్టును లత ఎలా ఆదుకున్నారంటే…
Latha didi: ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం లతాజీ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SS Rajamouli | ‘వారణాసి’ కథలో అదే కీలకం!
Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సీఎం నిలిపివేత.. ఇది కేంద్రం వేధింపులేనని ఆప్ ఆరోపణ
Credit Cards | క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనా చార్జీల్లేవ్.. యూజర్లకు ఆర్బీఐ ఊరట
Parakala Prabhakar | ‘సర్’ వ్యతిరేక నిరసనలో పరకాల ప్రభాకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

