Lata Mangeshkar | ఒక శకం ముగిసిపోయింది. భారతీయ సంగీత చరిత్రలో లతా మంగేష్కర్ది ప్రత్యేక స్థానం. మెలోడీ క్వీన్‌గా, గాన కోకిలగా ప్రఖ్యాతిగాంచిన లతా మంగేష్కర్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. దీంతో భారత సినీ అభిమానులు ఒక్కసారిగా మూగబోయారు. తన మరణ వార్తను ఇప్పటికీ జిర్ణించుకోలేకపోతున్నారు.
తను పాడిన పాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. తను ఎన్నో భాషల్లో వేలకు వేల పాటలు పాడారు. అందులో కొన్ని పాటలు అయితే.. జీవితాంతం అందరి గుండెల్లో నిలిచిపోతాయి. జనరేషన్లు మారినా ఆ పాటలకు ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. అటువంటి పాటల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం రండి.
Ajeeb Dastan Hai Yeh
దిల్ అప్నా ఔర్ ప్రీత్ అనే సినిమాలోని అజీబ్ దస్తాన్ హై ఎహ్ అనే పాటను ఇప్పటికీ సినీ అభిమానులు గుర్తుంచుకున్నారు. 1960లో వచ్చిన పాట అది.
Aaja Piya Tohe Pyar Du
బహరాన్ కే సప్నె అనే సినిమాలోని పాట అది. ఆర్డీ బర్మన్ కంపోజ్ చేసిన పాట అది. మజ్రూహ్ సుల్తాన్‌పూరీ ఆజా పియా తోహె ప్యాన్ దు అనే పాటను రచించారు.
Tune O Rangeele
ఆర్డీ బర్మన్ కంపోజ్ చేసిన మరో పాట ఇది. తునే ఓ రంగీలా అనే పాట కుద్రత్ సినిమాలోనిది.
Aaj Kal Paon Zameen Par
గుల్జర్ రచించిన ఆజ్ కల్ పావోన్ జమీన్ పర్ అనే పాటను ఆర్డీ బర్మన్ కంపోజ్ చేశాడు.
Yeh Sama, Sama Hai Ye Pyar Ka
జబ్ జబ్ ఫూల్ ఖిలె అనే సినిమాలోనిదే ఎహ్ సమా, సమా హై ఏ ప్యార్ కా అనే పాట.
Aa Jane Jaa
ఇంటాక్వామ్ అనే సినిమాలోని ఆ జానె జా అనే పాట ఇది. ప్యూర్ మెలోడీ సాంగ్.
Inhi Logon Ne
పాకీజా సినిమాలోనిది ఇన్హీ లోగోన్ నే అనే పాట. గులామ్ మహమ్మద్ కంపోజ్ చేసిన ఈ పాటను మజ్రూహ్ సుల్తాన్‌పూరీ రచించారు.
Lag Ja Gale
లగ్ జా గలే అనే పాటకు ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలుసు. నేటి జనరేషన్ యూత్ కూడా ఈ పాట అంటే పడి చచ్చిపోతారు. వో కౌన్ తీ అనే సినిమాలోనిది ఈ పాట.
Yeh Galiyan Yeh Chaubara
ప్రేమ్ రోగ్ అనే సినిమాలోనిది ఎహ్ గాలియాన్ ఎ చౌబారా అనే సాంగ్. లక్ష్మీకాంత్, ప్యారెలాల్ ఈపాటను కంపోజ్ చేశారు.
Piya Bina Piya Bina
అభిమాన్ అనే సినిమాలోని పాట ఇది. ఎస్డీ బర్మన్ ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ జంటగా నటించారు.