Lata Mangeshkar Remuneration | లతా మంగేష్కర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమా సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని కాదు ఏకంగా ఒక గ్రంథాన్ని లిఖించారు ఈ గాన సరస్వతి. 92 ఏండ్ల జీవితంలో 74 ఏండ్ల కెరీర్ ఉంది. కేవలం 13 సంవత్సరాల వయసులోనే ఆమె గాయనిగా తన కెరీర్ మొదలు పెట్టారు. 1942లో మొదటిసారిగా ఒక పాటను రికార్డింగ్ చేశారు లతా మంగేష్కర్. అయితే సినిమా ఫైనల్ ఎడిటింగ్‌లో ఆ సాంగ్‌ను తీసేసారు దర్శక నిర్మాతలు. అలా ఈమె పాడిన మొదటి పాట ప్రపంచం వినకుండానే మరుగున పడిపోయింది. అయితే ఆ తర్వాత హిందీ సినిమా పాటలకు లతా మంగేష్కర్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు.
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఉన్న దిగ్గజ సంగీత దర్శకులందరితోనూ పనిచేసిన ఘనత లతా మంగేష్కర్ సొంతం. ఏ పాట వచ్చినా దాన్ని లతాజీతోనే పాడించాలని సంగీత దర్శకులు ఆమె దగ్గరకు పరుగులు తీసేవాళ్లు. పాటలు పాడటం మాత్రమే కాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా అందరికంటే అగ్రస్థానంలో ఉండేది లతా మంగేష్కర్. అప్పట్లో ఒక్కో పాటకు భారీ పారితోషికం అందుకున్నారు. 1950ల్లోనే ఒక్కో పాటకు ఏకంగా 500 రూపాయలు ఈమె పారితోషికంగా అందుకున్నారు. ఈ విషయాన్ని కొన్నేండ్ల కింద ఆమె చెల్లెలు ఆశా భోంస్లే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తమకు ఒక్క పాట పాడినందుకు 150 రూపాయలు మాత్రమే ఇచ్చే నిర్మాతలు.. అక్క లతా మంగేష్కర్ కు మాత్రం ఏకంగా 500 రూపాయలు ఇచ్చే వాళ్లని ఆమె గుర్తు చేసుకున్నారు. అది తన అక్క గాత్రంలో ఉన్న మ్యాజిక్ అని చెప్పుకొచ్చింది. లతాజీ తప్ప ఆమె పాటలు మరెవరూ పాడలేరు అని ఎంతో మంది సంగీత దర్శకులు కూడా చెప్పేవాళ్లు. ఆమె పాట పాడితే సినిమాకు హైలెట్ అయ్యేది.. ఆమె పాటల కోసమే థియేటర్లకు వచ్చిన అభిమానులు కూడా ఎంతో మంది ఉన్నారు.
తర్వాత కాలంలో తన రెమ్యునరేషన్‌ను మరింత పెంచారు లతా మంగేష్కర్. చివరగా ఆమె ఒక్క పాటకు దాదాపు 5 లక్షలకు పైగానే తీసుకున్నారని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. నేటి గాయనీ గాయకులతో సమానంగా లతా మంగేష్కర్ కూడా రెమ్యునరేషన్ అందుకునే వాళ్లు. ఆమెపై ఉన్న గౌరవం.. ఆమె గాత్రంపై ఉన్న నమ్మకంతో నిర్మాతలు కూడా ఇంకేమీ మాట్లాడకుండా అడిగినంత పారితోషికం ఇచ్చేవాళ్లు. 11 భాషల్లో దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడారు లతా మంగేష్కర్. ఆమె నిష్క్రమణం సినీ సంగీత ప్రపంచానికి ఎన్నటికీ తీరని లోటు. భౌతికంగా లతాజీ లేకపోయినా ఆమె పాడిన పాటల రూపంలో ఎప్పటికీ అభిమానుల గుండెల్లో బతికే ఉంటారు.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
పాట పాడుతూ కింద పడిపోయిన లతా మంగేష్కర్.. ఈ సంఘటన గురించి తెలుసా..?
Lata Mangeshkar | సినీ అభిమానుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే లతా మంగేష్కర్ పాటలు ఇవే
Lata Mangeshkar | తెలుగులో మూడే పాటలు పాడిన లతా మంగేష్కర్.. కారణం ఏంటో తెలుసా?
Lata Mangeshkar | వరల్డ్ కప్ గెలిచిన జట్టును లత ఎలా ఆదుకున్నారంటే…
Latha didi: ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం లతాజీ..