రాజు భీమ్‌రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘జయహో ఇండియన్స్’. రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని బుధవారం విడుదల చేశారు. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు.. నాయకులా..? అమాయకులా..? దేశమా..? అనే కాన్సెప్టుతో ఈ చిత్రం రూపొందుతుందని చిత్రబృందం తెలిపింది. జారాఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ముమైత్‌ఖాన్, సీవీఎల్ నరసింహారావు, రామరాజు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ: జైపాల్‌రెడ్డి నిమ్మల.