Dharmendra | బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్దికాలంలోనే తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ధర్మేంద్ర, ఆరు దశాబ్దాలపాటు బాలీవుడ్‌కు ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను అందించారు. ఆయన మరణవార్తతో సినీలోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సెలబ్రిటీలు ధర్మేంద్రను తలచుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. అదే సమయంలో డ్రీమ్ గర్ల్ హేమ మాలిని (Hema Malini)తో ప్రేమ, పెళ్లి వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
19 ఏళ్ల వయసులోనే ధర్మేంద్ర.. ప్రకాష్ కౌర్ అనే మహిళను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇక 1970లో ‘డ్రీమ్ గర్ల్’ హేమమాలినితో కలిసి చేసిన సినిమాల సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. 1980లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ధర్మేంద్ర ఇస్లాం మతం స్వీకరించి, దిలావర్ ఖాన్ పేరుతో హేమ మాలినిని వివాహం చేసుకున్నట్లు పెద్ద ఎత్తున రిపోర్టులు వచ్చాయి. హేమ మాలిని అంటే అంత ప్రేమ ధర్మేంద్రకు.
ఇక 1981లో హేమ మాలిని తొలి బిడ్డకు (Esha Deol) జన్మనిచ్చింది. ఆ సమయంలో ధర్మేంద్ర చేసిన ఓ పనికి అందరూ షాక్ అయ్యారు. హేమమాలిని డెలివరీ టైమ్ దగ్గరపడుతున్న సమయంలో.. ఆమె కోసం ఏదైనా సమ్‌థింగ్ స్పెషల్‌గా చేయాలని భావించారు ఈ దిగ్గజ నటుడు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని పని చేశాడు. బిడ్డను కనే సమయంలో హేమ మాలినికి సౌకర్యంగా, గోప్యతకు భంగం కలగకుండా ఉండేందుకు మొత్తం నర్సింగ్ హోమ్‌నే బుక్ చేశాడు. నర్సింగ్ హోమ్‌లో ఉన్న 100 రూమ్‌లను బుక్ చేసినట్లు హేమ సన్నిహితురాలు నీతు ద్వారా వెలుగులోకి వచ్చింది. ‘హేమ గర్భవతి అని ఎవరికీ తెలియదు. ఆ సమయంలో ఆమె గోప్యతకు భంగం కలగకుండా ఉండేందుకు ధరమ్ జీ ఆసుపత్రిలోని అన్ని గదులను బుక్ చేశాడు’ అని నీతు ఓ సందర్భంలో గుర్తు చేసుకుంది.
హేమ-ధర్మేంద్ర జంటకు ఇద్దరు కుమార్తెలు. తొలుత ఇషా డియోల్ జన్మించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆహాన డియోల్ జన్మించారు. ప్రకాశ్ కౌర్-ధర్మేంద్ర జంటకు ఇద్దరు కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఉండగా, వారితో పాటు కుమార్తెలు విజేత, అజిత ఉన్నారు. ఇలా మొత్తం ఆరుగురు పిల్లలకు ధర్మేంద్ర తండ్రి అయ్యారు.
Also Read..
బాలీవుడ్ హీ-మ్యాన్ ధర్మేంద్ర ఇకలేరు
Dharmendra | పాకిస్థాన్‌లో ధర్మేంద్ర చాలా పాపులర్.. సంతాపం తెలిపిన మాజీ కెప్టెన్..!