Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర (Dharmendra) మృతిపట్ల సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సినీ వెటరన్తో తమకున్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. తన విలక్షణ నటనతో కోట్లాది మంది హృదయాలు దోచుకున్న ధర్మేంద్రకు మనదేశంలోనే కాదండోయ్.. పాకిస్థాన్‌లోనూ అభిమానులున్నారు. ఆయన పాక్‌లోనూ చాలా పాపులర్ అట. ఈ విషయాన్ని దాయది జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ వెల్లడించాడు.
అనారోగ్యంతో కన్నుమూసిన బాలీవుడ్ హీరోకు పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సంతాపం తెలిపారు. ఆయనకు తమ దేశంలో ఫాలోయింగ్ మామూలుగా లేదని చెప్పాడతడు. ‘ధర్మేంద్ర ఒక లెజెండరీ హీరో. ఆయన నటించిన షోలే సినిమా ఆల్ టైమ్ క్లాసిక్. ఉపఖండంలో ధర్మేంద్ర చెరిగిపోని ముద్ర వేశారు. ముఖ్యంగా పాకిస్థాన్‌లో ఆయన చాలా పాపులర్. ఆయన మృతిపట్ల నేను సంతాపం తెలియజేస్తున్నాను’ అని లతీఫ్ అన్నాడు. 2003లో పాక్ కెప్టెన్సీ చేపట్టిన లతీఫ్ 6 టెస్టులు, 25 వన్డేల్లో జట్టును నడిపించాడు. అనంతరం 11 ఏళ్లకు అతడు పాక్ జాతీయ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికయ్యాడు.
🗣️ ‘Immensely popular in Pakistan’
Rashid Latif pays tribute to India’s cinema legend Dharmendrahttps://t.co/ajJNC8faU7
— TOI Sports (@toisports) November 24, 2025
భారత సినిమా రంగానికి అపారమైన సేవలందించిన బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (Dharmendra) కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ సైతం దిగ్గజ సినీ నటుడికి సంతాపం తెలిపారు.
I, like many others, took an instant liking to Dharmendra ji, the actor, who entertained us with his versatility. That on-screen bond became stronger off-screen when I met him.
His energy was incredibly infectious, and he would always tell me, “Tumko dekhkar ek kilo khoon badh… pic.twitter.com/A8CmgR9WkW
— Sachin Tendulkar (@sachin_rt) November 24, 2025
1958లో ‘దిల్ బీ తేరా హమ్ బీ తేరే’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర, తన కెరీర్లో “షోలే”, “చుప్కే చుప్కే”, “ధర్మ్ వీర్”, “సీటా ఔర్ గీత”, “యాదోం కి బారాత్” వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. స్క్రీన్‌పై తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్, అద్భుతమైన స్టైల్‌తో ఆయనకు అభిమానులు “హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్” అనే బిరుదు ఇచ్చారు. ధర్మేంద్ర నటించిన తాజా చిత్రం ‘ఇక్కీస్ (Ikkis)’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది పరమవీర చక్ర గ్రహీత లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం. ఇందులో ఆయన హీరో తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.
Every home had a favourite Dharmendra film. He was a part of our growing up and of Indian cinema’s finest years.
He brought strength, charm and honesty to every role, and carried Punjab’s warmth wherever he went.
Behind the fame was a humble, grounded and deeply human soul.… pic.twitter.com/116K0XHuP5
— Yuvraj Singh (@YUVSTRONG12) November 24, 2025