సాధారణంగా సినిమా స్టార్స్ కొందరు ఒకసారి వెండితెరకి ఎంట్రీ ఇచ్చాక తమ పేరుని మార్చుకొని కొత్త పేరుతో జనాల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి అలసు పేరు శివశంకర వరప్రసాద్ కాగా ఆయన చిరంజీవి పేరుతో దేశ వ్యాప్తంగా క్రేజ్ పొందారు. ఇలా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ వేరే పేర్లతో ఎక్కువగా పాపులర్ అయ్యారు.
ఇక ఇటీవల పాగల్ సినిమాతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన విశ్వక్ సేన్‌కి వేరు పేరు ఉందట. నిజానికి విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. కానీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక విశ్వక్సేన్గా పేరు మార్చుకున్నాడు. ఈ పేరు తనకు బాగా కలిసి రావడంతో అలానే కంటిన్యూ అవుతున్నాడు.
వెళ్లిపోమాకే అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన విశ్వక్సేన్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్, ఫలక్‌నుమా దాస్ వంటి చిత్రాలతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు. రీసెంట్గా పాగల్‌తో పలకరించి పసందైన వినోదం పంచాడు.ఈ సినిమా తప్పక హిట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పిన విశ్వక్ తను చెప్పింది నిజమని నిరూపించాడు.