Prashanth Varma | గతేడాది సంక్రాంతికి హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma). తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడమే కాకుండా వరల్డ్‌వైడ్‌గా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం హన్మాన్ సినిమాకు సీక్వెల్ వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘జై హనుమాన్’ (Jai Hanuman) అంటూ ఈ సినిమా రానుండగా.. ఇప్పటికే ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుని షూటింగ్‌కి రెడీగా ఉంది. అయితే హన్మాన్ తర్వాత ప్రశాంత్ నుంచి ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకి వెళ్లలేదు.
హన్మాన్ అనంతరం బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌తో కలిసి ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు ప్రశాంత్. అయితే ఈ ప్రాజెక్ట్ అనుకొని కారణాల వలన క్యాన్సిల్ అయ్యింది. దీని తర్వాత కన్నడ నటుడు రిషబ్ శెట్టితో జై హన్మాన్, నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో డెబ్యూ సినిమాని ప్లాన్ చేశాడు. అయితే ఈ రెండు ప్రాజెక్టుల అనౌన్స్మెంట్ వచ్చి కనీసం నాలుగు నెలలకి పైగా అవుతున్న ఇప్పటివరకు అప్డేట్ లేదు. మరోవైపు హనుమాన్ తర్వాత జాంబీరెడ్డి సీక్వెల్ తీసే ఆలోచనలో ప్రశాంత్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై కూడా క్లారిటీ లేదు. గత ఏడాది నుంచి సెట్స్ మీదకి వెళ్లకుండా ఉన్న ప్రశాంత్ వర్మ ఈ ఏడాది అయిన తన ప్రాజెక్ట్‌లను ఫినిష్ చేస్తాడా అని ఆయన ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.