కోల్‌కతా: దేశంలో థర్డ్‌వేవ్ శరవేగంగా విస్తరిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతున్నది. బుధవారం ఆ సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరువయ్యింది. కరోనా బారిన పడుతున్న వాళ్లలో సామాన్యులతోపాటు రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు కూడా ఉంటున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్ ప్రముఖ నటుడికి కరోనా సోకింది. బెంగాలీ సూపర్ స్టార్ ప్రొసెంజిత్ ఛటర్జీకి కరోనా పాజిటివ్ వచ్చింది.
దాంతో ఆయన హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. అంతేగాక బెంగాల్ సినీ పరిశ్రమలో ఇంకా పలువురు నటులు, టెక్నీషియన్లకు కరోనా సోకిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రొసెంజిత్ ఛటర్జీకి స్వల్ప అస్వస్థత అనిపించడంతో ఆయన ఇవాళ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షలు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఈ విషయాన్ని ప్రొసెంజిత్ ఛటర్జీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప అస్వస్థతకు లోనవడంతో తన వైద్యుడి సూచనల మేరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని, ఆ పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. త్వరలోనే తాను మహమ్మారి బారి నుంచి కోలుకుంటానని ఆశాభావం వ్యక్తంచేశారు.