హైదరాబాద్ : కొవిడ్ సంక్షోభం నుండి త్వరలోనే బయటపడుతామని.. అందరూ సురక్షితంగా ఉండాల్సిందిగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సూచించారు. ట్విట్టర్ ద్వారా మహేశ్ స్పందిస్తూ.. కొవిడ్-19 కేసులు ప్రతీరోజు పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా అందరూ మాస్క్ ధరించాలన్నారు. అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దన్నారు. ఒకవేళ కొవిడ్ పాజిటివ్‌గా తేలితే సెల్ఫ్ ఐసోలేట్ కావాలన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య లక్షణాలు సరిచూసుకోవాలన్నారు. అవసరం అనుకుంటే తప్పా వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రిలో చేరాలన్నారు. తద్వారా పడకలు అవసరం ఉన్నవారికి అవి అందుబాటులో ఉంటాయని మహేశ్ పేర్కొన్నారు.
I believe that we'll all emerge stronger from this crisis. Stay safe everyone 🙏🏻
— Mahesh Babu (@urstrulyMahesh) May 8, 2021