సామాజిక స్పృహను రేకెత్తించే పలు చిత్రాలను రూపొందించిన దర్శకుడు భాను తొలిసారి ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కనకదుర్గారావు పప్పుల నిర్మాత. సింగిల్ షెడ్యూల్లో నాన్‌స్టాప్‌గా ఈ చిత్రాన్ని పూర్తి చేశామని, నేటి యువతను ఆకట్టుకునే అన్ని అంశాలుంటాయని, కథానుగుణంగా ఐదు అద్భుతమైన పాటలు కుదిరాయని మేకర్స్ తెలిపారు.
‘చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన ఓ అబ్బాయి, అమ్మాయి ఈ సినిమా ద్వారా నాయకానాయికలుగా పరిచయమవుతున్నారు. వారి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. నేటి తరానికి ప్రేమయొక్క గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఉంటుంది. త్వరలో టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం’అని దర్శకుడు భాను తెలిపారు.