Sandeep Reddy Vanga | టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి వంటి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్లో కబీర్ సింగ్‌గా తెరకెక్కించి సూపర్ హిట్‌ను అందుకోవడంతో పాటు అందరికంటా పడ్డాడు. ఇక యానిమల్ చిత్రంతో స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్. ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కించబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే రీసెంట్గా విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోన్న సందీప్ తన మొదటి మూవీ అర్జున్ రెడ్డి సినిమాపై ఆసక్తికర కామెంట్లు చేశాడు.
అర్జున్ రెడ్డి సినిమాను నేను నిర్మించడం వలన కొన్ని సన్నివేశాలు తీయలేకపోయాను. ఎందుకంటే అప్పటికే మా బడ్జెట్‌కి మించి చేశాం. అయితే నాకు ఇప్పటికి ఒక రిగ్రేట్ ఉంది. ఈ సినిమాలో ఫుట్‌బాల్ మ్యాచ్‌ని మంగళూర్‌లోని ఒక గ్రౌండ్లో వర్షంలో చేద్దామనుకున్నాం. కానీ బడ్జెట్ కుదరక వర్షం సీన్‌ని కట్ చేసి కేవలం మ్యాచ్ సన్నీవేశాన్ని మాత్రమే తెరకెక్కించాం అంటూ సందీప్ చెప్పుకోచ్చాడు.
“I promised a rain fight for #VijayDeverakonda in Arjun Reddy, but sadly couldn’t do it due to budget issues.”
– Sandeep Reddy | #Kingdom pic.twitter.com/G3oG5kt1HJ
— Movies4u Official (@Movies4u_Officl) July 25, 2025