THE PARADISE | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటిస్తోన్న ది ప్యారడైజ్ (THE PARADISE). Nani Odela 2 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర విషయం షేర్ చేసింది నాని టీం.
ఈ చిత్రానికి పాపురల్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మా హ్యాట్రిక్ కాంబినేషన్.. అనిరుధ్‌కు స్వాగతం అంటూ ట్వీట్ చేశాడు నాని. ఇప్పటికే నాని-అనిరుధ్ కాంబోలో వచ్చిన జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయని తెలిసిందే. ఇక హ్యాట్రిక్ సినిమా ఎలా ఉండబోతుందోనని అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టారు నెటిజన్లు, మూవీ లవర్స్.
ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. హింస, రక్తపాతం, తుపాకులు. గ్లోరీ, ఒక మనిషి.. అంటూ ఇప్పటికే నాని- శ్రీకాంత్ ఓదెల టీం విడుదల చేసిన లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడని వార్తలు వస్తుండగా.. దీనిపై నాని టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. నాని మరోవైపు హిట్ ఫేం శైలేష్ కొలను డైరెక్షన్లో మూడో పార్ట్ హిట్ 3 కూడా చేస్తుండగా.. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
We are on our hattrick 🙂
This will be Epic.#Paradise is N’Ani’Odela Film Now.
Welcome on board dear @anirudhofficial ♥️ pic.twitter.com/rxlJeX5ol7— Nani (@NameisNani) February 2, 2025
Game Changer | రాంచరణ్ అభిమానులకు ఎస్ థమన్ సారీ.. గేమ్ ఛేంజర్ గురించి ఏం చెప్పాడంటే..?
THE PARADISE | ఫిబ్రవరి.. జిమ్ సెషన్ స్టిల్‌తో నాని ఇచ్చిన హింట్ ఇదే