సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకుంటూ..ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu). ఈ యువ హీరో నటిస్తోన్న తాజా చిత్రం భళా తందనాన (Bhala Thandhanana). చైతన్య దంతులూరి (chaitanya dantuluri) డైరెక్ట్ చేస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజిని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 6న శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు శ్రీవిష్ణు.
బాణం సినిమా రోజుల నుంచి నేను చైతన్యతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. 14 ఏండ్లుగా మేమిద్దరం ఒకరికొకరం బాగా తెలుసు. తన పనితనంపై అద్బుతమైన క్లారిటీతో ఉండే చైతన్య నన్ను ఎంతో ఇంప్రెస్ చేశాడు. సినిమాలో మొదటి 25 నిమిషాలపాటు పాత్రలను పరిచయం చేసే సన్నివేశాలుంటాయి. సినిమా కథలోని ప్రతీ క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు.
సినిమాలో మీరు ఎక్కడా చూడని కొత్త యాంగిల్ చూస్తారు. ఇదే సినిమాకు హైలెట్‌గా నిలువబోతుంది. క్లైమాక్స్ తో ఆడియెన్స్ మంత్రముగ్దులవ్వడం గ్యారంటీ. కేజీఎం ఫేం గరుడ రామ్ సీన్లు చాలా బాగా వచ్చాయని అన్నాడు శ్రీవిష్ణు. ఇంటెన్స్ స్టోరీతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో కావాల్సిన వినోదం కూడా ఉంటుంది. కథ విన్న వెంటనే సినిమాకు ఓకే చెప్పా. ప్రేక్షకులకు మంచి థ్రిల్‌తోపాటు వినోదాన్ని అందిస్తుందని అన్నాడు.