Rashmika Mandanna | బ్లాక్బాస్టర్స్లో నటిస్తూ పాన్ఇండియా హీరోయిన్గా అవతరించింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. సామాజిక సమస్యలపై స్పందించడంతోపాటు.. బాధ్యతగా వ్యవహరించడం రష్మికలోని ప్రత్యేకత. తాజాగా కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఏర్పడిన విషాదం పట్ల రష్మిక తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
‘వందలమంది ప్రాణాలు కోల్పోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ కష్టకాలంలో కేరళ ప్రజలంతా మనోధైర్యంతో మెలగాలి. దేవుడు అందర్నీ ఆదుకుంటాడు’ అంటూ ప్రజలకు ధైర్యాన్ని చెప్పింది రష్మిక. అంతేకాకుండా తనవంతు సాయంగా కేరళ సీఏం రిలీఫ్ ఫండ్‌కు 10 లక్షల రూపాయలు విరాళంగా అందజేసింది. దీంతో రష్మిక మంచి మనసుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. రష్మికే కాదు, రష్మిక మనసు కూడా అందమైనదేనంటూ కితాబులిస్తున్నారు.