ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్, ఐపీఎల్ ఆటగాడు డేవిడ్ వార్నర్ క్రికెట్లో ఎంత ఫేమస్సో అంత కన్నా ఎక్కువగా టిక్‌టాక్ ద్వారా ఫేమస్ అయ్యాడు. గత ఏడాది ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో ఇంటికే పరిమితం అయిన వార్నర్ ఇటు సౌత్ అటు నార్త్ భాషలకు చెందిన సినిమాలలోని సూపర్ హిట్ సాంగ్స్‌కు టిక్ టాక్ వీడియోలు చేసి నెటిజన్స్‌ని అలరించాడు. భార్య పిల్లలతో కూడా కలిసి డేవిడ్ వార్నర్ తెలుగు పాటలకు వీడియోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కొన్ని సార్లు స్టార్స్ డాన్స్ వీడియో బిట్ లను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసాడు.
ఈ ఏడాది ఐపీఎల్ మధ్యలో ఆగిపోవడంతో విదేశీ ఆటగాళ్లందరు తమ స్వస్థలాలకు వెళ్లారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అక్కడి ప్రభుత్వం ఆదేశాల మేరకు సిడ్నీలోని ఒక హోటల్ లో 14 రోజులు క్వారెంటైన్ లో ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో గత ఏడాది చేసిన రాములో రాములా సాంగ్ మార్ఫింగ్ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియో పై కాండీ స్పందిస్తూ.. క్వారెంటైన్ లో బోర్ కొడుతుందా. వీడియోలు వరుసగా చేస్తున్నావు అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. భార్య కామెంట్స్ కు స్పందించిన వార్నర్ నా 14 రోజుల క్వారెంటైన్ ముగియబోతుంది. నా టార్చర్ ను భరించేందుకు సిద్దంగా ఉండూ అంటూ సమాధానం ఇచ్చాడు.