WAR 2 | యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు టాలీవుడ్లో తన సత్తా చూపించాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ గడ్డపై పౌరుషం చూపించేందుకు సిద్ధమయ్యాడు. వార్ 2 అనే చిత్రంతో ఆగస్ట్‌లో పలకరించనున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించడం ద్వారా పాన్ ఇండియా రేంజ్లో పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఈ మధ్య వచ్చిన దేవర చిత్రంతోను హిందీ ప్రేక్షకులని అలరించాడు. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరి, డ్యాన్స్, ఫైట్స్ ఇలా ప్రతిదాంట్లో కూడా వంద శాతం కమిట్మెంట్ ఇస్తాడు. అందుకే ఎన్టీఆర్ సినిమాలంటే అందరిలో అంత ఆసక్తి ఉంటుంది.
ఎన్టీఆర్ ఇప్పుడు నేరుగా హిందీ సినిమాలో నటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్న కారణంగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్‌లో మూవీ విడుదల కానుండగా, ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ప్రయత్నించిన కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే ఫస్ట్ లుక్ విషయమై చాలా ఆసక్తి ఉంది. ఎట్టకేలకు ఎన్టీఆర్ వార్ 2 లుక్ రివీల్‌కి ముహూర్తం ఖరారు అయింది. ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మే 20న వార్ 2 నుంచి స్పెషల్ సర్ప్రైజింగ్ వీడియోతో పాటు పోస్టర్ కూడా రాబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి.
ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేయనున్నారనే విషయాన్ని హృతిక్ రోషన్ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటించగా, ఎన్టీఆర్ విలన్ రోల్లో కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తుంది. మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ప్రముఖ హీరోయిన్ ఈ సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి.
Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2
— Hrithik Roshan (@iHrithik) May 16, 2025