Lokesh Kanagaraj | తమిళ అగ్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) హీరోగా తెరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. కూలీ సినిమాతో హిట్టు అందుకున్న లోకేష్ ప్రస్తుతం డైరెక్షన్‌ని దూరం పెట్టి నటనపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ‘రాకీ’, ‘సాణి కాయిదం’ మరియు ‘కెప్టెన్ మిల్లర్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా. తాజాగా ఈ చిత్రంలో నటించి హీరోయిన్ గురించి అప్డేట్ విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ యువ నటి వామికా గబ్బి (Wamiqa Gabbi) ఎంపికైనట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఒక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందనుండగా.. ఈ ప్రాజెక్టును సన్ పిక్చర్స్, లోకేశ్‌కి చెందిన జీ స్క్వాడ్ (G Squad) బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
సౌత్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేష్ కనకరాజ్ కార్తీతో ‘ఖైదీ’, విజయ్‌తో ‘మాస్టర్’, ‘లియో’, కమల్ హాసన్‌తో ‘విక్రమ్’, రజనీకాంత్‌తో ‘కూలీ’ వంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు ఈ దర్శకుడు. అయితే తాజాగా లోకేష్ హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.