దీపావళి పర్వదినం వేళ తెలుగు చిత్రసీమ సరికొత్త సంగతులతో ప్రేక్షకుల మోముల్లో ఆనందపు వెలుగుల్ని నింపింది. అగ్ర తారల టైటిల్ ఎనౌన్స్మెంట్స్, రిలీజ్ డేట్ల ప్రకటనలతో ఈ దివ్వెల పండగ మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, దళపతి విజయ్ ‘వారసుడు’, అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ చిత్రాలు సంక్రాంతి బరిలో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమయ్యాయి. రవితేజ తాజా చిత్రం ‘రావణాసుర’ వేసవి కానుకగా ప్రేక్షకుల్ని పలకరించనుంది.
వాల్తేరు వీరయ్య హంగామా
చిరంజీవి కథానాయకుడిగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీపావళి పర్వదినం సందర్భంగా సోమవారం టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. భారీ బ్లాస్టింగ్ యాక్షన్ అంశాలతో టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ‘ఏంట్రా ఆడొస్తే పూనకాలు అన్నారు. అడుగేస్తే అరాచకం అన్నారు. ఏడ్రా మీ అన్నయ్యా.. సౌండేలేదు’ అంటూ ప్రతినాయకుడు విసిరిన సవాలుకు స్పందించిన వాల్తేరు వీరయ్య ..ఓడను తగలబెట్టి బీభత్సం సృష్టించడం హై ఎమోషన్స్‌ను పంచింది. వింటేజ్ లుక్‌లో చిరంజీవి అభిమానుల్లో జోష్‌ను నింపారు. రవితేజ, శృతిహాసన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్థర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్,