VV Vinayak | ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి సంబంధించి జరుగుతున్న ప్రచారాలు అంతా ఇంతా కాదు. బ్రతికి ఉన్న వాళ్లని చంపేయడం, లేని పోని ఎఫైర్స్ అంటగట్టి వారి పరువున బజారున వేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వివి వినాయక్ అనారోగ్యం గురించి ఇటీవలి కాలంలో అనేక ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం వినాయక్‌తో శీనయ్య అనే సినిమాను దిల్ రాజు అనౌన్స్ చేయగా, ఆ సినిమా కోసం వినాయక్ డైట్ మెయింటైన్ చేసి ఫిట్‌గా మారాడు. ఎందుకో అది అర్ధాంతరంగా ఆగిపోయింది. హీరోయిన్ సమస్య అని ఫిలిం నగర్ టాక్.
వివి వినాయక్ అనారోగ్యంపై మళ్లీ వదంతులు.. అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది..!
ఇక శీనయ్య కోసం వినాయక్ లుక్ పూర్తిగా మారగా, ఆ సమయంలో అతని ఆరోగ్యం గురించి అనేక ప్రచారాలు సాగాయి. ఇక వినాయక్. కొంతకాలం క్రితం లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడనే ఓ టాక్ నడిచింది. అంతేకాదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వినాయక్‌ని పరామర్శించేందుకు ఏకంగా డైరెక్టర్ సుకుమార్, నిర్మాత దిల్ రాజు వెళ్లి మరీ పరామర్శించారని అన్నారు. ఆ సమయంలో జరిగిన తప్పుడు ప్రచారాలపై డైరెక్టర్ వివి వినాయక స్పందిస్తూ అవన్నీ ఫేక్ రూమర్స్ అని కొట్టి పారేశారు. ఇక ఇప్పుడు వివి వినాయక్ అనారోగ్యం పాలైనట్టు జోరుగా ప్రచారం సాగుతుండగా, దానిపై ఆయన టీమ్ స్పందించిది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, వినాయక్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన టీమ్ పూర్తి వివరణ ఇచ్చింది. వివి వినాయక్ గురించి కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు వాపోయారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయకుండా, వాస్తవాలను తెలుసుకొని ప్రచారం చేయాలి అంటూ వారు తెలియజేశారు. అయితే వివి వినాయక్ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా రూపొందిన వినాయక్ దర్శకత్వంలో రూపొందిన దిల్, ఆది, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్ కృష్ణ, అల్లుడు శీను వంటి సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేసిన విషయం తెలిసిందే.