టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu), పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), సన్నీలియోన్ కాంబినేషన్లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇషాన్ సూర్య (Ishan Surya) డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టు VM19గా తెరకెక్కుతుంది. కాగా జూన్ 10న దీని గురించి అప్ డేట్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే ఓ అప్ డేట్ వచ్చింది. అంతా అనుకున్నట్టుగానే ఈ సినిమా టైటిల్‌ను సరికొత్తగా ప్రకటించింది విష్ణు టీం. విష్ణు మొదట సునీల్‌కు ఫోన్ చేసి మంచి స్కిప్ట్ కావాలంటాడు. ఈ విషయం కోన వెంకట్‌ను అడిగితే బాగుంటుందని చెప్తాడు సునీల్.
విష్ణు ఫోన్ చేసిన వెంటనే కోనవెంకట్ ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఒకరి తర్వాత మరొకరు వస్తారు. ఇక కోనవెంకట్ కథ చెప్పగా.. మంచి టైటిల్ చెప్పాలని అడుగుతాడు విష్ణు. ఈ సినిమా టైటిల్ జిన్నా అని ప్రకటిస్తారు కోనవెంకట్. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నాడు విష్ణు. హోం బ్యానర్ ఏవీఏ ఎంటర్టైన్మెంట్ (AVA Entertainment)పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. జిన్నా చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించడటంతోపాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభుదేవా (Prabhu Deva) ఓ పాటకు కొరియోగ్రఫీ చేయబోతున్నట్టు సమాచారం.
Read Also : Janhvi Kapoor | క్రేజీ ప్రాజెక్టులో.. ముగ్గురు స్టార్ హీరోయిన్లు !
Read Also : Ranveer VS Wild Teaser | బియర్ గిల్స్ తో రణ్ వీర్ సింగ్ సాహసాలు..గూస్ బంప్స్ తెప్పిస్తోన్న టీజర్
Read Also : Anil Ravipudi | గర్జిస్తున్న సింహానికి పుట్టినరోజు శుభాకాంక్షలు..అనిల్ రావిపూడి ట్వీట్ వైరల్
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..