విజన్ స్టూడియోస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ అధినేతలు.. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన వ్యక్తులకు ‘ఐకాన్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2025’ పేరిట పురస్కారాలను అందించారు. విజన్ స్టూడియోస్ వారు తొలిసారి నిర్వహించిన ఈ అవార్డ్స్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు సినీ, వ్యాపారరంగ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్లో అతిథులుగా పాల్గొని విజన్ స్టూడియోస్ వారికి శుభాకాంక్షలు అందించారు. టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, నటి దివ్యవాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.