Vishwambhara | టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మెగా పాన్ ఇండియన్ మూవీ విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది.
ఈ మూవీ నుంచి హనుమాన్ జయంతి కానుకగా ఏప్రిల్ 12న రామ రామ అంటూ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి ప్రోమోను పంచుకున్నారు. రామ రామ అంటూ ఫుల్ ఎనర్జీటిక్గా సాగిన ఈ ప్రోమో మెగా అభిమానులను ఆకట్టుకుంటుంది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు.