Vishwambhara Book | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది. ప్రపంచ సినీ వేదికపై ‘విశ్వంభర’ తన సంచలనాన్ని మొదలుపెట్టింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘విశ్వంభర’ పుస్తకాన్ని ఆవిష్కరించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించబోతున్నారు చిత్ర నిర్మాతలు.
విశ్వంభర పుస్తకంలో ఏముంది?
UV క్రియేషన్స్ నిర్మాతలు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ పుస్తకంని పరిచయం చేస్తూ.. #WhatIsInsideVishwambharaBook అనే ప్రశ్నతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఈ పుస్తకంలో సినిమాకు సంబంధించిన అద్భుతమైన వివరాలు, చిత్ర ప్రపంచంలోని ప్రత్యేకతలు, మేకింగ్ విశేషాలు, విజువల్స్ గురించి ఉంటుందని తెలుస్తోంది. ఇది “యూనివర్స్ కి మించిన మెగా మాస్” అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం పేర్కొంది. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషిక రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.