నవీన్‌రాజ్, పూజా సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. అనన్యా క్రియేషన్స్, హరితవనం ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కైలాష్ దుర్గం నిర్మించారు. ఈ చిత్ర టైటిల్‌ను విశ్వక్సేన్ విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా కథతో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. నవతరం ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అజీమ్-వెంకట్, సంగీతం: ప్రజ్వల్ క్రిష్, దర్శకత్వం: జోయల్ జార్జ్.