విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 20న ట్రైలర్ను లాంచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘విశ్వక్సేన్ గత చిత్రాలకు భిన్నంగా ఉండే కథ ఇది. చక్కటి కామెడీతో పాటు రోమాంచితమైన యాక్షన్తో ఆకట్టుకుంటుంది. ముక్కోణపు ప్రేమాయణం కథలో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. జేక్స్ బిజోయ్ అద్భుతమైన సంగీతాన్నందించారు’ అని చిత్రబృందం తెలిపింది. శ్రద్ధాశ్రీనాథ్, నరేష్, వైవా హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, రచన-దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి.