Mechanic Rocky | విశ్వక్సేన్ కథానాయకుడిగా రూపొందుతోన్న మాస్ యాక్షన్ కామెడీ ఎంటైర్టెనర్ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకుడు. రామ్ తాళ్లూరి నిర్మాత. సోమవారం ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. నవంబర్ 22న సినిమాను విడుదల చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ తెలియజేశారు. ఈ పోస్టర్లో విశ్వక్సేన్ ఉద్వేగపూరితమైన ఎక్స్ప్రెషన్తో, మీనాక్షి చౌదరి సాంప్రదాయ చీరలో, శ్రద్ధా శ్రీనాథ్ మోడ్రన్ అవుట్ ఫిట్లో ఆకట్టుకున్నారు. ఈ నెల 20న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. నరేశ్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘురామ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ కాటసాని, సంగీతం: జేక్స్ బిజోయ్, నిర్మాణం: ఎస్ఆర్టీ ఎంటైర్టెన్మెంట్స్.