Vishwak Sen | ‘లైలా’ కథ వింటున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నా నవ్వులను ప్రేక్షకులకు కూడా అందిస్తే బాగుంటుంది కదా అనిపించింది. సాధారణంగా నేను కథల్ని సీరియస్‌గా వింటా. కానీ ఈ స్టోరీ వింటూ నవ్వుతూనే ఉన్నా’ అన్నారు విశ్వక్సేన్.
ఆయన కథానాయకుడిగా నటించిన ‘లైలా’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. రామ్‌నారాయణ్ దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. ఈ సినిమాలో విశ్వక్సేన్..సోనూమోడల్, లైలాగా డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం విశ్వక్సేన్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..